పాపం, చిరు వలన రామ్ చరణ్ కి ఇంత టెన్క్షనా..??

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా గురించి మననదరికి తెలుసు. ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ని ఇంతవరకు డిసైడ్ చెయ్యలేదు. అయితే ఐశ్వర్యరాయ్ బచ్చన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నటించడానికి ఐషూ 9కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందంట.

ప్రస్తుతం హిందీ సినిమాలకు 9కోట్లు పారితోషికం తీసుకుంటోందట. అందుకే అంతే పారితోషికం కావాలని ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ సరసన ‘రోబో’ లో నటించడానికి 6కోట్లు తీసుకుందట. అయితే రీ ఎంట్రీ తర్వాత ఐశ్వర్య తన పారితోషికం పెంచడమే కాకుండా, సౌత్ లో సినిమా అంగీకరించడానికి కూడా 9కోట్లు పారితోషికం కావాలని డిమాండ్ చేయడం షాక్ కి గురి చేస్తోంది.

ఇటీవల స్వయంగా రాంచరణ్ రంగంలోకి దిగి ఐశ్వర్యరాయ్ తో చర్చలు జరిపాడట. అయినా కూడా ఆ పారితోషకానికి దిగేది లేదని చెప్పిందంట. చిరు 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 టైం లో కూడా హీరోయిన్ కోసం రామ్ చరణ్ ఇలాగే పాట్లు పడ్డ సంగతి అందరికి తెలుసు. చిరు రోమాన్స్ కి హీరోయిన్స్ ఇలా భారీ బడ్జెట్ డిమాండ్ చేయడం రాంచరణ్ కి చాలా కష్టంగా ఉంటుందంట. కేవలం హీరోయిన్ కి అంత పెడితే సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందని ఆలోచిస్తున్నడంట. మరి చిరు సరసన నటించబోయే ఆ హీరోయిన్ ఎవరో వేచి చూద్దాం…