డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’మూడు రోజుల కలక్షన్ల వివరాలు…

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’సినిమా పై టాక్ అంత గొప్పగా రాలేదు కాని కలక్షన్స్ మాత్రం కేక పెట్టిస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేయగా, దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.65 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. వారాంతంలో బాక్సాఫీసు వద్ద ‘డీజే’ చక్కగా రాణించిందన్నారు.

సరైనోడు సినిమా కూడా మొదట నార్మల్ టాక్ వచ్చినా, తరవాత నిమ్మదిగా సూపర్ కలక్షన్లు లాక్కు వచ్చి, ఆ సినిమా హిట్ గా నిలిచింది అల్లు అర్జున్ కి. ఇప్పుడు ఈ సినిమా పై కూడా అనేక నెగిటివ్ టాక్స్ వస్తున్నప్పటికీ, కలక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ చిత్రం తొలిరోజు వసూళ్లలో బాలీవుడ్‌ సినిమా ‘ట్యూబ్‌టైల్‌’ను అధిగమించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా క్లైమాక్స్ పై అనేక కామెంట్స్ వచ్చాయి. చాలా మంది నెగటివ్ గానే రియాక్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి సెలవులు అయిపోయిన తరవాత ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలని అనుకుంటున్నారు. మొదట మిక్స్డ్ టాక్, తరవాత హిట్ అవ్వడం బన్నీ కి బాగా కలిసి వచ్చిందేమో మరి. ఏది ఏమైనా సెలువులు అయిపోయిన తరవాత అందరికి ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికయితే కలక్షన్స్ బాగున్నాయి…