పవన్ హీరోయిన్ బన్నీ తో రొమాన్స్! మరీ ఒకేసారి ఇంతలా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చిత్రీకరిస్తున్న సినిమాలో అనూఇమ్మాన్యువేల్ ఓ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ హీరోయిన్ కి పవన్ పక్కన నటించే బంపర్ ఆఫర్ దక్కించుకుందని అనుకునేలోపే మరో బంపర్ ఆఫర్ ని సొంతం చేసుకుంది.

డీజే సినిమాని పూర్తి చేసుకుని రీలీజ్ కు రెడీగా గా ఉన్న బన్ని… తరవాత సినిమా కూడా స్టార్ట్ అయిపొయింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనూఇమ్మాన్యువేల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారంట. మరి ఫైనల్ గా అనూఇమ్మాన్యువేల్ నే ఈ అవకాశం వరిస్తే, ఒకేసారి మెగా అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రావటం, అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలినట్టే..! అని అనుకుంటున్నారు.

రేపు విడుదల కాబోయే డీజే సినిమాపై అల్లు అర్జున్ ఫాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి రేపటితో సినిమా ఎంత సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో తెలుస్తుంది…