ఆడవారి సినిమా అంటూ అంత సెక్క్సాదారుణంగా…!!!

లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా… మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రం, వారి సాధికారత కోసం తీస్తున్న సినిమా అంటూ ఓరియెంటెడ్ గా సినిమా తీసారు.  ఇప్పటివరకూ పలు చిత్రాలు వచ్చాయి కానీ.. ఇలా కంప్లీట్ గా సెక్స్ ఓరియెంటెడ్ గా ప్రయత్నించిన వారెవరూ లేరు. ఇండియన్ సొసైటీకి ఏ మాత్రం తగిన చిత్రం కాదు అంటూ సెన్సార్ గట్టిగా చెప్పింది. అయినా కూడా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి వచ్చేస్తోంది.

ఈ సినిమా విడుదలను ఆపేందుకు పంకజ్ నిహలానీ ఆధ్వర్యంలోని సెన్సార్ బోర్డ్ నానా ప్రయత్నాలు చేసింది. అసలు ఎలాంటి సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదని.. రిలీజ్ కి అంగీకరించే సమస్యే లేదని తేల్చి చెప్పిన తర్వాత.. ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన మేకర్స్.. చివరకు ”ఎ” సర్టిఫికేట్ సంపాదించి విడుదల చేసేస్తున్నారు.

ఈ సినిమా  అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా మూవీని బ్యాన్ చేసేందుకు సెన్సార్ బోర్డ్ ఎందుకు అంతగా ప్రయత్నించిందనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. ట్రైలర్ నిండా బూతు డైలాగులు.. సెక్స్ కు సంబంధించిన మాటలు మాత్రమే కాదు.. నేరుగా సన్నివేశాలను కూడా ఇరికించేశారు. ఈ ఏడాది అత్యంత వివాదాస్పదమైన చిత్రం అని వారికి వారే ట్యాగ్ ఇచ్చుకున్న ఈ సినిమా.. నలుగురు మహిళల సీక్రెట్ ఫ్యాంటసీలు.. వారి సెక్స్ కోరికలపై ఆధారపడి ఉంటుంది.