పరకాల పదవికి చంద్రబాబు ఎసరు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వపు సలహాదారుడు పరకాల ప్రభాకర్ పదవికి చంద్రబాబు ఎసరు పెట్టారు. త్వరలోనే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించనున్నారు. అయితే అంతకుమించిన పదవిని ప్రమోషన్ గా ఇవ్వబోతున్నారట. ఇప్పటివరకు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న పరకాల.. చంద్రబాబుకు కీలకమైన కోటరీలో ఒకరిగా కూడా ఉన్నారు. బాబు విదేశీ టూర్లలోనూ పరకాల తప్పకుండా ఉంటున్నారు. పెద్దపెద్ద సంస్థలతో జరుగుతున్న ఎం.ఓ.యూ.లు కూడా పరకాల ప్రభాకర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోల్లో చంద్రబాబు అండ్ టీమ్ దొరికినప్పుడు కూడా మొదట పరకాల ప్రభాకరే మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు వాయిస్ ఒరిజినల్ రికార్డు కాదని, ఎక్కడో.. ఎప్పుడో మాట్లాడినవన్నటినీ గుదిగుచ్చి చంద్రబాబు మాట్లాడినట్లు బిల్డప్ ఇచ్చారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుదాడి కూడా చేశారు. మరి అలాంటి మనిషిని చంద్రబాబు అంత త్వరగా వదులుకోడుకదా? అందుకే ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. గవర్నర్ కోటాలో పరకాలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఆయన స్థానంలో ఈనాడు బ్యూరో చీఫ్ డీ.ఎన్.ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారని వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో టాక్ నడుస్తోంది.