వామ్మో! డీజే ప్రేక్షకులు కత్తులు దూసుకున్నారు…

అల్లు అర్జున్ చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాని బన్నీ ఫాన్స్ తో పాటు, సినీ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ ఎంత దూరం వెళ్లిందంటే, కత్తులు దూసుకుని పరస్పరం దాడులు చేసుకునే లెవెల్ కి వెళ్ళింది.

ఈ సంఘటన ఖలీల్ థియేటర్, నంద్యాల, కర్నూల్ లో జరిగింది. ఒక పదిమంది యువకులు మద్యం సేవించి ఈ చిత్రం చూడడానికి వచ్చారు. వారు తాగిన మైకంలో ఈలలు వేస్తూ గోల చేసారు. ప్రేక్షకులు ఇబ్బందిపడటంతో…కొంతమంది ఇది తగదని చెప్పగా, తాగిన వారు దాడికి తెగబడ్డారు. ప్రేక్షకులు కూడా అభ్యంతరం చెప్పడంతో, వారి పై కూడా దాడి చేసారు.

అప్పుడు వడ్డె సుబ్బరాయుడు కత్తి తీసి తాగిన యువకుల పై దడి చేయగా, రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.