గురు రివ్యూ …

నటీనటులు : వెంకటేష్‌, రితికా సింగ్‌, నాజర్‌

దర్శకత్వం : సుధ కొంగర

నిర్మాత : ఎస్‌. శశికాంత్‌

సంగీతం : సంతోష్‌ నారాయణన్‌

విడుదల తేదీ : మార్చి 31, 2017

వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమా పై ఎంతో ఆశక్తిగా ఉన్నారు తెలుగు సినీ అభిమానులు. ఎందుకంటే ఈ మద్యకాలంలో వెంకటేష్ ఎంచుకున్న సినిమాలు… దృశ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల ఇలాంటి సినిమాలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత సంపాదించుకున్నాడు వెంకి. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న గురు సినిమా ఎలా ఉందొ కథలోకి వెళ్లి చూద్దాం…

ఆది (వెంకటేష్‌) కు బాక్సింగ్ క్రీడ‌ అంటే ప్రాణం. కాని ఆది మెంటాలిటీ వలన…ముక్కుసూటి మ‌న‌స్త‌త్వానికితోడు కాస్త షార్ట్ టెంప‌ర్‌ ఉండటంతో కొందరి రాజకీయాల వలన తాను అనుకున్నది సాధించలేకపోతాడు. కావాల‌ని అత‌డిని దూరంగా ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్‌ కోచ్‌గా నియమిస్తుంది అకాడమీ. కూరగాయలు అమ్ముకుంటూ తల్లిదండ్రుల్ని పోషించుకునే రాములు (రితికా సింగ్‌) ఆది కంట పడతుంది. లక్స్‌ (ముంతాజ్‌) అనే మ‌రో అమ్మాయి మాత్రం బాక్సర్‌గా రాణించి తద్వారా పోలీస్‌ ఉద్యోగం సంపాదించాలనుకొంటుంది. మట్టిలో మాణిక్యం లాంటి ఆమె ప్రతిభను కనిపెట్టిన ఆది ఆమెకు ఎలాగైనా ట్రైనింగ్ ఇస్తే, దేశానికి పతాకాలు తెస్తుందని ఆశిస్తాడు. అతికష్టం మీద ఆమెను ఒప్పించి, కోచింగ్ మొదలు పెడతాడు. అయ‌తే రాములు మాత్రం కేవలం అత‌డిచ్చే డబ్బుకోసం మాత్ర‌మే కోచింగ్‌ తీసుకుంటూ, ఆదిని చులకనగా చూస్తుంటుంది. ఆదిపై కోపంతో కావాలని కొన్ని మ్యాచ్‌లు ఓడిపోతుంటుంది. అలాంటి అమ్మాయిని ఎలా దారిలో పెట్టి, తను అనుకున్నది సాధిస్తాడో తెలియాలంటే గురు సినిమా చూడాల్సిందే…

సినిమా ఎలా ఉందంటే…

సినిమా మొత్తం ఆట చుట్టూనే తిరిగింది. తెలుగు సినిమాలలో ఆటకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన సినిమా ఇదే అనిపిస్తుంది. వెంకటేష్ తన పాత్రలో అద్భుతంగా జీవించాడు. గురువు శిష్యురాలి మద్య జరిగే యుద్ధం, సెంటిమెంట్, పోరాటం, స్పోర్ట్స్ స్పిరిట్ అన్నీ కూడా దర్శకురాలు చక్కగా చిత్రీకరించారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ కూడా మంచి ప్రక్షకులకు బాగా నచ్చుతుంది. ప్రతీ పాత్రలో సహజత్వం కనిపించడంలో, ఎమోష‌న్ల‌ను చిత్ర‌మంతా క్యారీ చేయ‌డంలో దర్శకురాలు సుధ కొంగ‌ర విజ‌యం సాధించింది. సంగీతం కూడా సినమాలో కొన్ని సీన్స్ కి బాగా సపోర్ట్ అయ్యింది.మొత్తం మీద సినిమాకి మంచి టాక్ వచ్చింది.

రేటింగ్ : 3.25/5