డిజే సినిమా వలన దిల్ రాజ్, హరీష్ శంకర్ పోలీస్ స్టేషన్ కు…

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. ఈ సినిమా అంత హిట్ టాక్ రాకపోయినా, కలక్షన్స్ మాత్రం రాబడుతున్నాయి. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటూ కొన్ని వీడియో లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి.

ఈ సినిమా పై అల్లు అర్జున్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే అల్లు అర్జున్ సక్సెస్ ల సరవేగంలో ఉన్నాడు. రిలీజ్ రోజు ఈ సినిమా కి అంత పాజిటివ్ టాక్ రాకపోవడంతో, ఇప్పుడు చెప్పు బ్రదర్ అని పోస్ట్ లు కూడా హల్చల్ చేసాయి సోషల్ మీడియాలో.  కాని బన్నీ లక్ పైగా సెలవులు కలిసి రావడంతో కలక్షన్స్ బాగున్నాయి.

ఇదిలా ఉంటె మరో పక్క డిజే మొత్తం సినిమాని సోష‌ల్ మీడియాలో లీక్ చేసేశారు. దీని వలన వస్తున్న కలెక్షన్స్ తగ్గు మొఖం పట్టడానికి చాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. అందుకని నిర్మాత దిల్‌రాజు,ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సైబ‌ర్ క‌మీష‌న‌ర్‌కు పైర‌సీని అడ్డుకోవాల‌ని పిర్యాదు చేశారు. పిర్యాదుపై స్పందించిన క‌మీష‌న‌ర్ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌మీ ఇచ్చారు.