స్మార్ట్  ఫోన్ వాడుతున్నారా? ఈలక్షనాలు మీలో ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి

స్మార్ట్  ఫోన్ కి ఇప్పటి జనరేషన్ ఎంతగా అలవాటు పడ్డారో చెప్పుకోనక్కర్లేద్దు. ఆఖరికి వాష్ రూమ్ కి వెళ్ళినా కూడా స్మార్ట్ ఫోన్ ని వెంట పెట్టుకుని వెళ్ళే స్థితికి వచ్చింది నేటి యువత. పరిశోధకులు అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారిన వారిని… ‘ఎక్కువగా ఒంటరిగా ఉండడం, ఆందోళనగా ఉండడం, ఒత్తిడికి లోనవడం’ వంటి లక్షణాల ఆధారంగా వర్గీకరించారు.

స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌కి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఐజక్‌ వాగేఫి మాట్లాడుతూ… ‘మనం ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు అప్పటికప్పుడు సంతృప్తినిచ్చే ఒక ఉత్ప్రేరకంగా మారాయి’అని తెలిపారు. పరిశోధనల్లో భాగంగా 182 కళాశాలకు చెందిన విద్యార్థులను ఎంచుకుని వారి రోజువారి స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ దగ్గర్లో లేకపోతే ఆత్రుతకు, ఒత్తిడికి గురయ్యారని పరిశోధకులు తెలిపారు.

‘అతిగా సోషల్‌ మీడియాను ఉపయోగించడం, ఆఫర్ల పేరిట గంటల తరబడి ఆన్‌లైన్‌ షాపింగ్‌లలో ఉండడం, అదే పనిగా వీడియో గేమ్‌లు, వీడియోలు చూడడం’ వంటి లక్షణాలన్నింటినీ కలిపి సాంకేతిక పరిభాషలో ‘టెక్నాలజీ అడిక్షన్‌’ అని అంటారు. ఫోన్ రింగ్ అవ్వకపోయినా పదే పదే అయినట్టు అనిపించడం, ఫోన్ లేకపోతే ఆందోలనగా ఉండటం ఇలాంటివి అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిదని అంటున్నారు పరిశోధకులు.