పెళ్లి కుదిరిన తరుణ్, ఇది నా లవ్ స్టోరీ…ఆమంటే చాలా ఇష్టమట!

తరుణ్ చిన్నప్పుడే సినిమాలో నటించి బాల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరవాత నువ్వేకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. కాని తరవాత తరుణ్ కు పెద్ద హిట్స్ తగలకపోవడంతో అతని కెరియర్ అంతగా సాగలేదు. ఇంతలోనే ఆర్తి అగర్వాల్ తో ప్రేమ అంటూ అనేక వార్తలు కూడా సంచలనం చేసాయి.

తరుణ్ తల్లి రోజారమణి ప్రాణ స్నేహితురాలు కూతురితో తరుణ్ వివాహం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. తరుణ్ కి ఈ అమ్మాయి చిన్నప్పట్నుంచి ఫ్రెండ్ అట. లండన్ లో గ్రాడ్యువేషన్ పూర్తి చేసిందట. ఈ అమ్మాయంటే తరుణ్ కి చాలా ఇష్టమట. ఆ అమ్మాయికి కూడా తరుణ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది.

ఇప్పుడు తరుణ్ ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ తరవాత వీరిద్దరికి పెళ్లి చెయ్యాలని నిర్ధారించారని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే, తరుణ్ ఇక బ్యాచ్లర్ లైఫ్ నుంచి బయటకు వచ్చి, ఒక ఇంటివాడు అవుతాడు…