కమలం మార్క్ రహస్యం

కమలం పార్టీ సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది. దేశ అత్యున్నత పదవి విషయంలో కూడా చివరి నిమిషం వరకూ మూడో కంటికి తెలియకుండా వ్యవహారం నడుపుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి వచ్చేనెలతో ముగియనున్న నేపథ్యంలో కొత్తగా మరొకరిని నియమించాల్సి ఉంది. అయితే ఈసారి రాష్ట్రపతి పదవిని ఎవరికి అప్పగించాలనే విషయమై అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

మొదట్లో అద్వానీ పేరు విన్పించినా చివరికి ఆయన మెడకు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను చుట్టారు. కోర్టుల చుట్టూ తిప్పుతూ ఆపెద్దాయన్ను ప్రీప్లాన్డ్ గా పక్కకు తప్పించారు. తర్వాత ఇంకెవరి పేరూ విన్పించకుండా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. ఈ వ్వవహారమంతా కేవలం మోడీ, అమిత్ షాలు మాత్రమే చూస్తున్నారు. మధ్యలో రాజ్ నాధ్ సింగ్ సూచనలు కూడా వారు తీసుకుంటున్నారు. అంతేతప్ప.. ఇక మరెవ్వరికీ తెలియకుండా కమలదళం జాగ్రత్త పడుతోంది. అయితే విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేరును బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆమె అందరికీ ఆమోదయోగ్యురాలని చివరికి కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు ఇస్తారన్న ఆలోచనతో బీజేపీదళం ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ శివసేన రంగంలోకి దిగి తన ఆలోచనను బీజేపీ పెద్దల ముందుంచింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును రాష్ట్రపతి పదవిఇ సూచించారు. ఒకవేళ ఆయన కాదంటే పర్యావరణవేత్త, హరితవిప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాధన్ పేరును పరిశీలించాలని శివసేన పట్టుబడుతోంది. అయితే ఈనెల 28తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో కమలదళం ఎవరి పేరును ఫైనల్ చేస్తుందోనని దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.