కాటమరాయుడు రివ్యూ… రేటింగ్

సినిమ.. కాటమరాయుడు

నటీనటులు- పవన్ కళ్యాణ్, శ్రుతిహాస్సన్, రావు రమేష్, నాజర్, ఆలీ తదితరులు..

సంగీతం- అనుప్

నిర్మాత- శరత్ మరార్ దర్శకత్వం- కిషోర్ కుమార్ పార్ధసాని(డాలి)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా ఈ రోజు రిలేజ్ అయిన విషయం అందరికి తెలిసినదే. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఫ్లాప్ అయిన తరవాత కూడా ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. దానికి కారణం పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ అని అందరికి తెలుసు. పవన్ శ్రుతిహాసాన్ అంటేనే సక్సెస్ అని ఒక సెంటిమెంట్. ఎందుకంటే ఎంతో కాలం ఫ్లాప్ లతో బాధ పడతున్న పవన్ కి గబ్బర్ సింగ్ మంచి టర్నింగ్ ఇచ్చింది. అందులో కూడా శ్రుతి హాస్సన్ పవన్ కి జంటగా నటించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్ ని సొంతం చేసుకుంటాదని ఫాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కి ఓవర్సీస్ లో మంచి టాక్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పేరు తెచ్చుకుంటాదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్దాం…

కథ…

కాటమరాయుడు(పవన్‌ కల్యాణ్‌) వూరికి పెద్దగా ఉంటూ, పేదోళ్ల పాలిట దేవుడిగా రాయుడ్ని అందరూ కొలుస్తుంటారు. రాయుడికి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు). రాయుడికి తమ్ముళ్ళు అంటే ప్రాణం. ఊర్లో ఎవరికీ ఆపద వచ్చినా రాయుడు కాపాడతుంటాడు. అలాగే తమ్ముళ్ళకు కూడా అన్న అంటే గౌరవం. అయితే రాయుడికి ఆడవాళ్ళు అంటే అస్సలు పడదు. అందుకని అతను పెళ్లి చేసుకోడు. అతను పెళ్లి చేసుకోకపోవడం వలన తమ్ముళ్ళు కూడా పెళ్లి మాట ఎత్తరు గాని అమ్మాయిలు పెళ్లి ఇలాంటి ఆశలు ఉన్నా అన్నయ్య కోసం కామ్ గా ఉంటారు. ఇంతలో కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శ్రుతిహాసన్‌) ప్రవేశిస్తుంది. అలాగే తమ్ముళ్ళ జీవితంలోకి కూడా అమ్మాయిలు వస్తారు. అవంతికా తండ్రిగా నాజర్ చేసాడు. నాజర్ కు రాయుడు కుటుంబం గురించి ఒక విషయం తెలుస్తుంది. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఉంటుంది. విలన్ రాయుడు తమ్ముడుని లోబరచుకోవడానికి చూస్తాడు. అసలు అవంతికా ఎవరు? నాజర్ కి రాయుడు కుటంబం గురించి ఏం తెలిసింది? అవంతికా రాయుడు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి?రాయుడు తమ్ముళ్ళ లవ్ స్టోరీ లు ఎలా మొదలవుతాయి ఇవన్నీ తెలియాలంటే కాటమరాయుడు సినిమా చూడాలి…

సినిమా ఎలా ఉందంటే…

ఇంతకాలం తమ్ముడుగా అల్లరి వాడిగా నటించిన పవన్.. ఇప్పుడు ఎంతో భాద్యతతో కూడిన అన్నయ్య పాత్ర చేసాడు. నలుగురు తమ్ముళ్ళకు అన్నగా పవన్ చక్కగా నటించాడు. పంచి కట్టులో ఒక రైతుగా అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో పవన్, శ్రుహాస్సన్ మద్య రొమాంటిక్ సీన్స్ చాలా బాగా పండాయి. ‘వీరమ్‌’కి రీమేక్‌ గా తీసిన ఈ సినిమా అంతా అలానే ఫాలో అయిపోయాడు దర్శకుడు. కొత్తగా ఏమీ ఆలోచించలేదు. తమ్ముళ్ళతో సరదా సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ సాగిపోతుంది. సినిమా అంతా పవన్ భుజాల పైనే నడిచింది. పవన్ ఫాన్స్ కు పవన్ ఎలా కావాలో అలానే చూపించాడు దర్శకుడు. పవన్ ఈ సినిమాలో చలా రొమాంటిక్ గా నటించాడు. అన్నదమ్ముల మధ్య బలమైన భావోద్వేగ స‌న్నివేశాలు చూపించగలగడంతో పతాక సన్నివేశాలకు న్యాయం జరిగింది. సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

సినిమాలో ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అలాగే పవన్, శ్రుతి రొమాంటిక్ సీన్స్ హైలెట్. సినిమాలో కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఇక సెకండ్ ఆఫ్ లో సినిమా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి మళ్ళి సినిమా ఊపు అందుకుంటుంది. మొత్తం మీద సినిమా బాగానే ఉంది . సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తో నిరాశగా ఉన్న ఫాన్స్ కు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంది. అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో బాగానే ఉంది. సెకండ్ ఆఫ్ లో డైరెక్టర్ ఇంకొంత ఎఫర్ట్ పెట్టి ఉంటె బాగున్ను అనిపిస్తుంది. పాటలు, డ్యాన్స్ లు కూడా అంతగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. ప్రసాద్‌ మూరెళ్ల తన కెమెరాతో సినిమాకు వన్నె తెచ్చాడు. ఆయన ఎంచుకున్న కలర్‌ కాంబినేషన్స్‌, పల్లెటూరి అందాలను చూపించిన తీరు అలరిస్తుంది. వీర‌మ్ క‌థ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను జోడించి అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్‌కల్యాణ్‌ కోసం.. ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా.

రేటింగ్- 3.5/5