ఏంటి లావణ్య ఆహీరోలతో అలా???

ఇటీవల జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో తన క్లోవేజ్ అందాలతో కెమెరాలకు కునుకు లేకుండా చేసిన లావణ్య త్రిపాఠి, మెగా హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లను కొట్టేస్తుంది. తాజాగా మరో మెగా హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది ఈ అమ్మడు.

అల్లు శిరీష్‌తో ‘శ్రీరస్తు శుభమస్తు’, వరుణ్ తేజ్‌తో ‘మిస్టర్’ వంటి సినిమాల్లో లావణ్య త్రిపాఠి మెగా హీరోల సరసన నటించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఆ చాన్స్ కూడా మామూలు చాన్స్ కాదు, వి.వి. వినాయక్ లాంటి అగ్ర దర్శకుడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో చాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం ‘జవాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తేజు ఆ వెంటనే వినాయక్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. సి కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ అందించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా, అందులో లావణ్య త్రిపాఠి ఒక హీరోయిన్. మొత్తానికి మెగా హీరోల సరసన వరుసగా నటించుకుంటూ వస్తుంది లావణ్య. మరి నెక్స్ట్ ఎవరితోనో…