మహేష్ బాబు ఎంతో ఎగ్జైట్ అయ్యాడట…ఎందుకంటే…

మహేష్ బాబు స్పైడర్ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. దీని తరవాత మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు.

బ్రహ్మోత్సవం సినిమా మహేష్ ఫాన్స్ ను ఎంతగానో నిరుత్సాహ పరచింది. అయితే మహేష్ చేయబోయే సినిమాలపై ఫాన్స్ చాలా ఆశక్తిగా ఉన్నారు. స్పైడర్ టీజర్ రిలీజ్ తరవాత ఆ సినిమా పియా ఇంకా ఆశక్తి పెరిగింది. అందులో మహేష్ లుక్ చాలా డీసెంట్ గా ఉంది. ఇక దీని తరవాత శ్రీమంతుడు లాంటి హిట్ సినిమాని అందించిన మహేష్, కొరటాల కాంబినేషన్ మళ్ళీ రావడం ఫాన్స్ కి చాల ఆనందంనగా ఉంది.

ఆ తరవాత మహేష్ బాబు కెరీర్‌లో 25వ సినిమాగా రానున్నసినిమా వంశీ పైడిపల్లి తో కలిసి చేస్తున్నాడంట. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తియ్యడానికి ప్లాన్ చేస్తున్ననామని, ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే మహేష్ బాబు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారని ఓ లీడింగ్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ చెప్పారు