మణిరత్నం దర్శకత్వంలో సినిమా “చెలియా” …. రివ్యూ & రేటింగ్..!

నటీనటులు: కార్తీ, అదితి రావు, లలిత, శ్రద్ధ శ్రీనాథ్, రుక్మిణి , గణేష్ తదితరులు

సంగీతం: ఏ ఆర్ రహమాన్

నిర్మాత: మణిరత్నం, శిరీష్ (మద్రాస్ టాకీస్)

రచన, దర్శకత్వం: మణిరత్నం

కార్తీ హీరోగా, మణిరత్నం నటించిన సినిమా “చెలియా” ఈ రోజు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే కథలోకి వెళ్దాం…

కథ…

వరుణ్ (కార్తీ) మిలిటరీ పైలట్ శత్రువులకు బందీ అయ్యి ఉంటాడు. జైలు లో తన లవ్ స్టోరీ ని గుర్తుతెచ్చుకుంటాడు. వరుణ్ చూడ్డానికి బలంగా ఉంటాడు కాని, అతి సున్నితమైన మనసు కలిగి ఉంటాడు. ఒక డాక్టర్ (అదితి రావు హైదరి) ని ప్రేమిస్తాడు వరుణ్. ఆ ఆతర్వాత అనేక కారణాల వలన శత్రువులకు చిక్కి బందీ గా ఉంటాడు. మొత్తానికి జైలు నుంచి తప్పించుకుంటాడు వరుణ్. జైలు నుండి తప్పించుకొని అదితి కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ కలిసారా? అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి? అనేవి తెలియాలి అంటే “చెలియా” సినిమా చూడాల్సిందే!

సినిమా ఎలా ఉందంటే…

మణిరత్నం సినిమా అనగానే హీరో హీరోయిన్స్ ఎవరని కూడా ఆలోచించరు. సినిమా టైటిల్,పోస్టర్ చూస్తేనే గత అద్భుత సినిమాలు రోజా ఇలాంటివి గుర్తుకు వస్తాయి. దేశభక్తితో పాటు లవ్ స్టోరీ రొమాన్స్ ను కూడా చాలా చక్కగా తెరకెక్కించారు. సినిమాలో చలా చోట్ల రోజా సినిమా గుర్తుకువస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా హైలెట్. ఇక హీరో హీరోయిన్ మద్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. యుద్ధం, ప్రేమ, రొమాన్స్ ఈ మూడు కలిపితే “చెలియా” సినిమా. మణిరత్నం ఫ్లేవర్ ఉన్న సినిమా అంటే నచ్చే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్-3/5