మంత్రి నారాయణ అలా చేశారా?

ఏపీ మంత్రి నారాయణ గురించి ఓ వార్త సంచలనం రేపుతోంది. ఆయన ఓరోజు రాత్రి చేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావటంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. అదేంటి.. మంత్రి నారాయణ ఆపని ఎలా చేశారంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదని కూడా చెప్పుకుంటున్నారు.

ఇంతకీ ఏంజరిగిందంటే.? ఆయన రెండవ భార్య కుమారుడు నితీష్ కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాధఛాయలు అలుముకున్నాయి. అందరూ అయ్యో పాపం అంటూ బాధపడ్డారు. మంత్రి నారాయణ విదేశీ పర్యటన అనంతరం రెండో రోజు చేరుకుని తన బిడ్డ మృతదేహాన్ని చేసి కన్నటి పర్యంతమయ్యారు. అనంతరం అదే రోజు నిషిత్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. వీఐపీలు, వీవీఐపీల సానుభూతి పలకరింపులతో మంత్రి నారాయణ క్షణం తీరికలేకుండా ఉన్నారు. అయితే అదే రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాజధానిలోని అధికారులకు మంత్రి నారాయణ ఫోన్ చేశారట.

రాజధాని టెండర్ల వ్యవహారం తమకు అనుకూలంగా లేదన్నది ఆ ఫోన్ సారాంశమంట. టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సిందిగా వారికి ఆదేశాలిచ్చారట. కన్నబిడ్డ చనిపోయాడన్న బాధను పక్కను పెట్టి టెండర్లు తమకు అనుకూలంగా లేవని ఫోన్ చేయటమంటే నారాయణ మరీ అంత కమర్షియలా? అనే ప్రశ్నలు వినవస్తున్నాయి.