అమరేంద్ర బాహుబలి డైట్ మీకు తెలుసా?

బాహుబలి సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా లో హీరో అయిన ప్రభాస్‌కు ఎంతటి గుర్తింపు వచ్చిందో చెప్పుకోనక్కరలేదు. బాహుబలి లో ప్రభాస్ రెండు పాత్రలు నటించాడు. ఒకటి అమరేంద్ర బాహుబలిగా, రెండు శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ కనిపిస్తాడు. అయితే రెండు క్యారెక్టర్లలోనూ శరీరం పరంగా కొద్దిగా వైవిధ్యాన్ని చూపించారు. అమరేంద్ర బాహుబలి భారీ కాయంతో కనిపించగా, శివుడు కొంత తక్కువ శరీరంతో కనిపిస్తాడు.

అమరేంద్ర బాహుబలి పాత్రలో భారీ కాయంతో కనిపించడానికి ప్రభాస్ చాలా కష్టపడ్డాడంట. వ్యాయంమంతో పాటు డైట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాల్లో అయ్యాడంట. ప్రభాస్ డైట్ చూసి, ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా భయపడ్డారంట. కాని తరవాత నిమ్మదిగా ప్రభాస్ అలవాటు పడటంతో, ధైర్యం వచ్చిందంట. ఇంతకీ ఆ డైట్ ఏమిటంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా 42 ఉడకబెట్టిన కోడిగుడ్లు (తెల్లని సొన మాత్రమే), పావు కిలో చికెన్, పండ్లను ప్రభాస్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేవాడట.

మధ్యాహ్నం లంచ్ గా బ్రౌన్ రైస్, ఓట్స్, పాస్తా, బ్రకోలి, సలాడ్స్, ప్రోటీన్ పౌడర్, సూప్, పాలు లంచ్ టైంలో ప్రభాస్ తినేవాడట. రాత్రి కి డిన్నర్ గా పుల్కాలు, చికెన్, పండ్లు, పాలు తదితరాలను నైట్ డిన్నర్‌లో ప్రభాస్ తీసుకునేవాడట. అది అమరేంద్ర బాహుబలి డైట్.