వామ్మో! బాహుబలి అనగానే ప్రభాస్ ఎంత మాట అన్నాడో తెలుసా?రాజమౌళి ఏమనుకుంటాడని కూడా ఆలోచించాలా???

హీరో కన్నా విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్న రానా కొత్తగా యాంకర్ అవతారం ఎత్తి జెమినీ టీవీ కోసం నెంబర్ వన్ యారి అనే సెలబ్రిటీ షో ఒకటి చేస్తున్నాడు. ఈ షోలో టాలీవుడ్ నటులను పిలిచి, వారి పర్సనల్ విషయాలను అడుగుతూ, ఇంకా… వారి అభిప్రాయాలు, అనుభవాలు గురించి అడుగుతూ, చిట్చాట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు.

ఈ ప్రోగ్రాంకు సంభందించిన ప్రోమో విడుదల చేసారు. ఇందులో మొదట అతిధిగా బాహుబలి లాంటి అద్భుతాన్ని సృష్టించిన  రాజమౌళి వచ్చాడు. అందులో భాగంగా రానా రాజమౌళి ఎదురుగా ప్రభాస్ కు ఫోన్ చేయటం, రాజమౌళి బాహుబలి 3 తీస్తా అంటున్నాడు అనగానే అవతల ప్రభాస్ ‘అమ్మ నీయమ్మ’అని సరదాగా బదులు ఇవ్వడంతో జక్కన్నతో పాటు రానా కూడా షాక్ తో కూడిన నవ్వుల్నీ మనసారా పంచుకున్నారు.

బాహుబలి కోసం ప్రభాస్ 5 సంవత్సరాలు పాటు మిగిలన సినిమాలను, ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి ఎంత కష్టపడ్డాడో అందరికి తెలుసు. మళ్ళీ ఆ ప్రోసీజర్ మొత్తం మొదలవుతుంది అంటే… ప్రభాస్ అలా స్పందించడం లో తప్పులేదు మరి. అందుకే అందరూ ఒక్కసారిగా అంతలా నవ్వుకున్నారు. మొత్తానికి ప్రోమో తో,  ఈ షో లో ఎంత రచ్చ ఉండబోతోందో చిన్న హింట్ ఇచ్చేసాడు రానా. బుల్లితెర ప్రేక్షకులకు ఈ ప్రోగ్రాం పై ఆశక్తి పెరిగింది…