అవకాశాలు లేక బిచ్చగాడైన కమెడియన్

సినిమా కెరియర్ చూసే వాళ్లకు ఎంత బాగుంటాదో, చేసే వాళ్లకు అన్ని కష్టాలను, నష్టాలను కూడా చవి చూపిస్తుంది. ఎన్నో ఆశలతో సినిమా రంగంలో అడుపెట్టి, మొదట్లో అవకాశాలు వచ్చినా, తరవాత అవకాశాలు దొరకకపోతే వారి పరిస్థితి దేవుడికే తెలియాలి. పలు తమిళ సినిమాల్లో నటించి, తనదైన టైమింగ్ తో కామెడినీ పండించి, తన రూపంతో కూడా ప్రేక్షకులను నవ్విస్తూ ‘పల్లు బాబు’గా పేరు తెచ్చుకున్నాడు.

తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఒకటీ రెండు అనువాద సినిమాలతో పరిచయస్తుడే పల్లుబాబు. శంకర్ నిర్మాణంలో వచ్చిన ‘ప్రేమిస్తే’ తెలుగునాట కూడా సూపర్ హిట్ కదా.. ఆ సినిమాలో ఇతడు నటించాడు. హీరోహీరోయిన్లు లేచిపోయాకా ఆశ్రయించే ఫ్రెండ్ కు ఫ్రెండ్ గా పల్లుబాబు కనిపిస్తాడు. అయితే కొన్నిరోజులకి అవకాశాలు రాకపోవడం, అదే సమయంలో తల్లిదండ్రుల మరణంతో దిక్కులేని వాడుగా మారిపోవడంతో ఇతడు బిచ్చగాడు అయ్యాడు. యాచకుడిగా బతుకీడుస్తున్నాడు. సినిమాలపై మోజుతో చెన్నై వచ్చి అడుక్కు తినేవాడయ్యాడు పల్లుబాబు.