బాలయ్య గుండెల్లో గోలీశోడా కొట్టిన పులగం ఎవరో తెలుసా?

సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా జరుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలను వేగంగా పూర్తి చేసే స్పెషాలిటీ ఉన్న పూరి ఈ సినిమాని ఇంకా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ మాత్రమె కాకుండా వెంటవెంటనే ఎడిటింగ్ కూడా పూర్తి చేసి బాలయ్యకు చూపిస్తున్నాడంట పూరి. వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి అయిన తరవాత బాలయ్య క్రేజ్ కు తగ్గట్టు, పాటను చిత్రీకరించబోతున్నాడంట. వందల మంది డ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాటను బాలకృష్ణ, అందాల తార మిస్కిన్‌పై తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఆనంద్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

గీత రచయిత పులగం చిన్నారాయణ రచించిన ఈ పాట బాలయ్య రేంజ్‌కు తగ్గట్టు గా  ‘నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నట్టున్నాదే… గుండెల్లో గోలీసోడా కొట్టేసినట్టున్నాదే’ అనే మాస్ పాటను చిత్రీకరించబోతున్నారంట. ఈపాట కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారని, నాలుగు రోజులు పాటు ఈ పాట చిత్రీకరిస్తారని తెలిపారు. మొత్తానికి బాలయ్యకు ఈ వయసులో గుండెల్లో గోలీశోడా కొట్టించబోతున్నారు పులగం చిన్నారాయణ.

ఇంతకీ ఈ పులగం చిన్నారాయణ ఎవరంటే… జర్నలిస్టుగా, సినీ పాటలు, మాటల రచయితగా, పీఆర్వోగా సుపరిచితులు. చిన్నప్పటి నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ ఉన్న చిన్నారాయణ కవితలు, కథలు, సినిమా వ్యాసాలు, పుస్తకాలు రాస్తూ వచ్చారు. జంధ్యాల తీసిన మొత్తం 39 సినిమాల గురించి ‘జంధ్యామారుతం’ మరియు నంది అవార్డు అందుకున్న సినిమాల గురించి ‘ఆనాటి ఆనవాళ్ళు’ ఇంకా ‘సినీ పూర్ణోదయం’ , ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ , ‘పసిడి తెర’ ఇలా అనేక అద్భుతమైన పుస్తకాలను, వ్యాసాలను రచించారు.