డబ్బు కోసమే అప్పుడు అలా చేశానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా, దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. రకుల్‌ కు ఇప్పుడు తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్‌ ఆరంభంలో మోడల్‌గా పనిచేసిన రకుల్‌ ఓ కన్నడ సినిమాతో, సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

రకుల్ తన మొదటి సినిమాలో ఎలా? ఎందుకు? నటించిందో ఇలా చెప్పుకుంటూ వచ్చింది… “నేను డిగ్రీ చదువుతున్న సమయంలో కన్నడ సినీ పరిశ్రమ నుంచి 2009లో ‘గిల్లీ’ సినిమా ఆఫర్‌ వచ్చింది. నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ, ఆ సినిమా చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అప్పటికి నెలకు నా పాకెట్‌ మనీ కేవలం రెండు వేల రూపాయలు.

అందుకే డబ్బు వస్తుందనే కారణంతో ‘గిల్లీ’ చేశాను. ఆ సినిమా తర్వాత చాలా మంది కన్నడ నిర్మాతలు వచ్చారు. కానీ, చదువు మీద దృష్టిపెట్టాలని వారికి ‘నో’ చెప్పాను. చదువు పూర్తయిన తర్వాత ‘కెరటం’సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశాన’ని చెప్పింది. అయితే పాకెట్ మనీ కోసం మొదలైన రకుల్ సినిమా జీవితం, ఇప్పుడు ఇంత సక్సెస్ ని తేచ్చిపెట్టిందన్నమాట…