రవితేజ సోదరుడు భరత్‌ విషయంలో అంత అన్యాయం జరిగిందా?

రవితేజ సోదరుడు భరత్‌ రవితేజ కి మచ్చ తెచ్చిన విధంగా డ్రగ్స్ వినియోగం, మద్యం సేవించడం లాంటి పలు వివాదాలలో దూరడం అందరికి తెలుసు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో పరిసర ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరమై కెరీర్‌పై దృష్టిపెట్టాడని అంటున్నారు.
బిగ్ బాస్‌ షోకు ఎంపికైనట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయిలోని ఓ టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం భరత్ కి వచ్చిందట. ఈ కార్యక్రమాన్ని కొన్నేండ్లుగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రసారం కాబోయే బిగ్‌బాస్ రియాలిటీ సిరీస్‌లో నటించే అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు.
దీని కోసం ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకొంటున్నట్టు సమాచారం. గ్లామర్ కోసం స్విమ్మింగ్, జిమ్ ఫిట్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగానే భరత్ శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో స్విమ్మింగ్, జిమ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ క్రమంలోనే శనివారం కూడా జిమ్, స్విమ్మింగ్ లాంటివి పూర్తి చేసుకొన్నట్టు తెలుస్తున్నది. నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే భరత్ మృత్యువు వార్త వినాల్సి వచ్చింది.
ఒకవేళ ప్రమాదానికి గురికాకుండి ఉంటే భరత్‌కు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కేది. దేశవ్యాప్తంగా భరత్‌కు ప్రాచుర్యం లభించేది. మరొక నెలలోనే బిగ్‌బాస్ షూటింగ్ కూడాప్రారంభం కానున్న సమయంలో దేవుడు చాలా అన్యాయం చేసాడని అనుకుంటున్నారు.