‘మామ్’ మూవీపై సెన్సార్ రివ్యూ…

అతిలోకసుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై ‘మామ్‌’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శ్రీదేవి కెరియర్‌లో 300 వ చిత్రం కావడంతో దీనిపై అందరికి ఆశక్తిగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్, ట్రైల‌ర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా దాని పై భారీ అంచనాలను కూడా పెంచింది.పైగా ఈ మూవీ ప్రమోషన్స్‌కి శ్రీదేవి స్వయంగా రంగంలో దిగడంతో ఇంకా ఆశక్తిగా ఉంది సినీ అభిమానులకి. . తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ చిత్రాన్ని న్యూ ఏజ్‌ మదర్‌ ఇండియాగా చెప్పొచ్చు. ఇందులో శ్రీదేవి అభినయం నర్గీస్‌ను గుర్తు తెచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టాల్సిందేనని సెన్సార్‌ సభ్యులు అన్నారు. మంచి కథ, కథనాలతో రవి ఉద్యవర్‌ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారని, శ్రీదేవి నటన ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అని ప్రశంసించారు