కుటుంబం కోసం నలిగిపోతున్న మెగా హీరో…ఎటువైపు అడుగేస్తాడో?

మెగా హీరో సాయిధరం తేజ్ ఇప్పుడు ‘జవాన్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజు సరసన మెహ్రీన్ కౌర్ పీర్జాడా హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ మూవీకి.. ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని, రీసెంట్ గా ఇటలీలో రెండు పాటలను కూడా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజు సమర్పణలో, బీవీఎస్ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

దర్శకుడు బీవీఎస్ రవి పుట్టిన రోజు సందర్భంగా.. జవాన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు.  ఇటు దేశానికి అటు కుటుంబానికి మధ్య నలిగిపోయే కుర్రాడిగా కనిపిస్తున్నాడు సాయిధరం తేజ్. చేతిలో ఉన్న ఫోన్ లో ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తుండగా.. తీవ్రమైన ఆలోచనతో మథనపడుతున్నట్లుగా తేజు కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను ఇంటెన్సిటీ కనిపించేలా రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి తేజు అటు దేశం, ఇటు కుటుంబం ఎవరివైపు అడుగు వేస్తాడో చూడాలి అని ఆడియన్స్ కి ఆశక్తి రేపెలా ఉంది ఈ ఫస్ట్ లుక్.

ఆగస్ట్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుప్రీమ్ లాంటి భారీ సక్సెస్ తో, 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించాడు సాయిధర్మ్ తేజ్. ఆ తర్వాత తిక్క, విన్నర్ లాంటి రెండు ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు జవాన్ పెద్ద హిట్ ఇస్తుందో, మరో ప్లాప్ లో కలిసిపోతుందో చూడాలి…