దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ఫంక్షన్ ఎక్కడ జరగబోతుందో తెలుసా?

మామూలుగా సినిమా వేడుకలను…బహిరంగంగానో, హోటల్స్ లోనో, పెద్ద పెద్ద ఫంక్షన్ ప్లేసెస్, స్టేడియం లోనో జరగడం చూసాం. కాని ఎప్పుడు రాజకీయాలతో దద్దరిల్లే పార్టమెంట్ భవనంలో సినిమా వేడుకలు జరగడం చూడలేదు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ఫంక్షన్ పార్లమెంట్ భవనంలో జరగబోతుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా డైరెక్షన్‑లో తెరకెక్కిన రాగ్ దేశ్ సినిమా ట్రైలర్‑ను మన పార్లమెంట్ భవనంలో విడుదల చేసేందుకు అనుమతి లభించింది.

నేతాజీ సుభాస్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వాలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు తిగ్మాంషు ధులియా స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‑ను త్వరలో పార్లమెంట్ వేదికగా, పలువురు సినీ రాజకీయ ప్రముఖల సమక్షంలో నిర్వహించనున్నారు.