కేసీఆర్ దెబ్బకు మరో ఎంపీ బలి

రాజకీయ చాణిక్యుడు కీసీఆర్ వేస్తున్న పాచికలకు సొంత పార్టీ నేతలే బలవుతున్నారు. ఎప్పుడు ఎవరిమీద ఆయన తన బ్రహ్మాస్త్రాన్ని వదులుతారో ఎవ్వరికీ అంతుపట్టటంలేదు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీని ఒంటిచేత్తో ఎదుర్కొంటూనే రెండోవైపు తన సొంత పార్టీలోని నేతలపైనా ఆయన కత్తికడుతున్నారు. తనకు నచ్చనివారిని టార్గెట్ చేసుకుని ఒక్కో బాణాన్నీ వదులుతున్నారు.

తాజాగా కేసీఆర్ దెబ్బకు మరో ఎంపి డి.శ్రీనివాస్ బలయ్యారు. ఆయన ఎసైన్డ్ భూములు కొన్నారంటూ మీడియాకు లీక్ లు ఇచ్చారు. దీంతో ఈ వివాదం సీనియర్ నేత డీ.శ్రీనివాస్ మెడకు చుట్టుకుంది. అయితే తానేమీ అలాంటి భూములు కొనలేదని, ఆరవై ఏళ్ల రికార్డులు పరిశీలించాకే భూములు కొన్నానని డీ.శ్రీనివాస్ వివరణ ఇచ్చుకుంటున్నా ఎవ్వరూ నమ్మటంలేదు. అసలు ఆ భూములు ఎసైన్డ్ వేనని, అలాంటిది ఎన్నేళ్ల రిజిస్ట్రేషన్లు పరిశీలించుకున్నా ఏంప్రయోజనంలేదని అంటున్నారు.

ఇటీవలే కే.కేశవరావును పీకల్లోతు కష్టాల్లోకి దింపిన కేసీఆర్ ఇప్పుడు డి.శ్రీనివాస్ భరతం పట్టే పనిలో పడ్డారు. వీరిద్దరూ సొంత పార్టీ ఎంపిలే అయినప్పటికీ తోకజాడిస్తున్నారని వారిపై కత్తి కట్టారు. మరి ఇంకా రానున్న రోజుల్లో ఎంతమంది కేసీఆర్ వలలో చిక్కుకోబోతున్నారో చూడాలి